Adipurush: రిలీజ్‌కి ముందు అండగా ఉన్నవాళ్ల నుంచే… ఇప్పుడు బ్యాన్ డిమాండ్

ఓం రౌత్ అంటించిన ఆదిపురుష్ నిప్పు ఇప్పట్లో చల్లారేలా లేదు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు భారీ బజ్ ఉన్న ఈ మూవీ ప్రీమియర్స్ తర్వాత నెగిటివిటీని ముటగట్టుకుంటుంది. ఆదిపురుష్ అసలు రామాయణం ఆదారంగా చేశారా? అంటూ కొంత మంది అనుమానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రాముడు మీసంతో ఉండటం, లంక గ్రాఫిక్స్, అల్లావుద్దీన్ ఖిల్జీని పోలి ఉన్న రావుణుడు ఇలా చాలా అంశాలు ట్రోల్లింగ్ కంటెంట్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, వీటిపై వచ్చే ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి.

అంతే కాకుండా, హన్మంతుడి నుంచి కొన్ని అసభ్యకరమైన డైలాగ్స్ చెప్పించడంపై కూడా తీవ్ర దుమారాన్ని లేపుతుంది. దీనిపై స్వయంగా సినిమా రచయిత స్పందించి, ఆ డైలాగ్స్‌ను తొలగిస్తామని చెప్పినా, ఈ వివాదలు, ట్రోల్స్ ఆగడం లేదు. దీనికి తోడు సీత జన్మస్థలం భారతదేశం అన్నట్టు సినిమాలో చూపించారు. ఇది మనవాళ్లుకు పెద్దగా ఇబ్బంది పెట్టకున్నా, పరాయి దేశం నేపాల్ ప్రజలు మాత్రం దీనిపై మండిపడతున్నారు. దీని ఫలితంగా ఆ దేశ రాజధాని ఖట్మాండులో ఏకంగా ఇండియన్ సినిమాలపై బ్యాన్ విధించారు.

కలెక్షన్ల పరంగా ఎలా ఉన్న ఈ ట్రోల్స్, వివాదాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రం మనం దేశంలో కూడా బ్యాన్ డిమాండ్ ను ఎదుర్కొంటుంది. #BanAdipurushMovie #BoycottAadipurush అనే హ్యాస్ ట్యాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిజానికి ఈ ట్రెండ్ ముందే వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ దర్శకులు, ప్రొడ్యూసర్ల నుంచి వచ్చే సినిమాలు ఈ బ్యాన్, బైకాట్ ట్రెండ్ బారీన పడి తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. డిజాస్టార్ గా మారిన లాల్ సింగ్ చడ్డా నుంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పఠాన్ వరకు ఈ ట్రెండ్ బారీన పడి, తీవ్రంగా నష్టపోయాయి. పఠాన్ కు బైకాట్ ట్రెండ్ రాకుంటే కలెక్షన్ల పరిస్థితి మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు.

- Advertisement -

అయితే ఆదిపురుష్ రిలీజ్ కు ముందు, బ్యాన్, బైకాట్ ట్రెండ్ రాలేదు. దీని వెనుక కారణం… రామాయణం నేపథ్యంలో రావడం ఒకటైతే, మరొకటి రాజకీయపరమైనది. ఆదిపురుష్ ను ఓ రాజకీయ పార్టీ నెత్తిన పెట్టుకుని మరీ ప్రమోషన్స్ చేసింది. ఇలా మొత్తంగా ఆదిపురుష్ రిలీజ్ కు ముందు బైకాట్ ట్రెండ్ ను తప్పించుకుంది. కానీ, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత బైకాట్, బ్యాన్ ట్రెండ్ కు అడ్డంగా దొరికిపోతుంది. విడుదలకు ముందు ఏ వర్గం వాళ్లు అయితే సినిమాకు అండ దండగా ఉన్నారో.. ఆ వర్గం వాళ్లే ఆదిపురుష్ కు దండేసి బ్యాన్ చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఆదోళనలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో కూడా ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది.

అయితే ఆదిపురుష్ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే ఆదిపురుష్ చిత్రం 340 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే ప్రస్తుతం నెగిటివ్ టాక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఇలాంటి కలెక్షన్లు ఉండవేమో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు