Tiger3: బాలీవుడ్ సినిమాలకు పబ్లిసిటీ… తెలుగు స్టార్ హీరోలే ఫస్ట్ ఆఫ్షన్

భాష ఏదైనా, సినిమాలకు ప్రమోషన్స్ అనేది చాలా కీలకం. అందు కోసం ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయాలను ఖర్చు చేయడానికి కూడా వెనకాడరు. కానీ, కొన్ని సందర్భాల్లో పైసా ఖర్చు లేకుండా సినిమాలు పబ్లిక్ నోట్లోకి వెళ్తుంటాయి. అవే గాసిప్స్. సినిమాలో పలానా హీరో గెస్ట్ రోల్ చేస్తున్నాడు అంటూ చిన్న గాసిప్ స్టార్ట్ అవుతుంది. అంతే.. మూవీ టీం పెద్దగా ఏం చేయలేకున్న పర్లేదు. ఫ్యాన్స్, మీడియానే ఫ్రీగా సినిమాను పబ్లిసిటీ చేస్తాయి.

అందుకు బెస్ట్ ఎక్సాంపుల్ లియో. విజయ్, లోకేష కాంబినేషన్ లో వచ్చిన లియో సినిమాలో మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్యామియో రోల్ చేస్తున్నాడు అంటూ రిలీజ్ కు ముందు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మూవీ టీం కూడా ఆ గాసిప్స్ పై స్పందించలేదు. ఆ గాసిప్ మూవీ ఓపెనింగ్స్ పై ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు టైగర్3కి కూడా అదే జరుగుతుంది. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. టైగర్ 3, వార్ 2 రెండు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచే వస్తున్న నేపథ్యంలో టైగర్3 సినిమాలో వార్ 2 కి సంబంధించిన కొన్ని హిట్స్ ఉండబోతున్నాయని, అందు వల్ల టైగర్3 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడు అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

- Advertisement -

ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ రూమర్ వచ్చిన నాటి నుంచి టైగర్ 3 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రొడ్యూసర్లు పైసా ఖర్చు చేయకున్నా మంచి పబ్లిసిటీ లభించింది. ఈ ఫ్రీ పబ్లిసిటీ వల్ల ప్రొడ్యూసర్లు యష్ రాజ్ ఫిల్మ్స్ కూడా దీనిపై స్పందించడం లేదు. తెలుగు హీరోల క్రేజ్ ని నిర్మాతలు ఇలా తమ సినిమాల ప్రమోషన్స్ కు వాడేస్తున్నారు.

అయితే టైగర్ 3లో అయితే తారక్ ఉండే ఛాన్స్ లు ఎక్కువే ఉన్నాయి. YRF లో భాగంగా ఇటీవల వచ్చిన పఠాన్ సినిమాలో షారుక్ ఖాన్ మెయిన్ హీరో. కానీ, ఓ ఫైట్ సీన్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు. అలా టైగర్ 3 సినిమాలో కూడా తారక్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఈ వార్తలను నమ్మలేమని కూడా ఓ వాదన ఉంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు