Tamil Rockers Trailer : హెడ్ ఎవరు ?

సినీ పరిశ్రమను వేధిస్తున్న అనేక సమస్యలలో పైరసీ భూతం ఒకటి. చాలా సినిమాలు థియేటర్ లలో రాకముందే హెచ్ డీ క్వాలిటీతో పైరసీ ద్వారా బయటకు వస్తున్నాయి. దీని వల్ల నిర్మాతలు విపరీతంగా నష్టపోతున్నారు. ఇలా పైరసీ చేసే వెబ్ సైట్ లలో తమిళ్ రాకర్స్ ముందు వరుసలో ఉంది. ఈ పైరసీ నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్ తమిళ్ రాకర్స్. సోనీ లివ్ లో ఈ నెల 19 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్ తమిళ ట్రైలర్ మూడు వారాల క్రితమే వచ్చింది. తాజాగా టీం తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.

”దేశ సినీ చరిత్రలో మొట్ట మొదటి సారిగా యాక్షన్ స్టార్ ఆదిత్య నటించిన గరుడ సినిమా దీపావళి రోజున థియేటర్స్ కి రావడానికి ముందే 5.1హెచ్ డీ క్వాలిటీతో రిలీజ్ అవుతుంది. మీ తమిళ్ రాకర్స్ లో..” అంటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. దీని తర్వాత గరుడ మూవీ టీం పడ్డ టెన్షన్, పోలీసులు విచారణ అంతా.. ఉత్కంఠగా సాగుతుంది.

ఈ వెబ్ సిరీస్ లో ఒక సినిమాను ఎలా పైరసీ చేస్తారు?. దాని చూట్టు ఉన్న నెట్ వర్క్ ఏంటి? ఇలా చేయడం వల్ల తమిళ్ రాకర్స్ కు వచ్చే లాభం ఏం ఉంటుంది? అసలు ఈ తమిళ్ రాకర్స్ వెనక ఉన్న హెడ్ ఎవరు? అనే అంశాలను ఈ ట్రైలర్ లో చూపించినట్లు తెలుస్తుంది. ”తమిళ్ రాకర్స్ హెడ్ వాడే..” అంటూ ఓ పోలీస్ అధికారి చెప్పిన డైలాగ్ తో సిరీస్ పై ఆసక్తి పెరుగుతుంది. దీని వెనక ఉన్నది ఎవరు అని తెలుసుకోవాలని అనిపిస్తుంది.

- Advertisement -

కాగా ఈ తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్ ను దర్శకుడు అరవగళన్ తెరకెక్కించాడు. ఏవీఎం ప్రొడక్షన్ నిర్మించగా, అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటించారు. కాగా ఈ సిరీస్ సోనీ లివ్ లో ఈ నెల 19 నుండి అందుబాటులోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు