Tamannah Bhatia : తమన్నా టాప్ 3 కాంట్రవర్సీలు… వైరల్ కిస్ వీడియో కూడా…

Tamannah Bhatia : తమన్నా గురించి మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ దాకా అందరికీ పరిచయమే ఈ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా చట్ట విరుద్ధంగా 2023 లో ఐపిఎల్ ను స్ట్రీమింగ్ చేసిన కేసులో సమన్లు అందుకుని వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా తమన్నా కెరీర్లో ఎదురైన టాప్ 3 వివాదాలు ఏంటో తెలుసుకుందాం.

చట్టవిరుద్ధమైన ఐపిఎల్ స్ట్రీమింగ్

ఏప్రిల్ 25న చట్ట విరుద్ధమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ట్రీమింగ్ కేసులో తమన్నా పేరు రావడం ఆమె అభిమానులను షాక్ కు గురి చేసింది. మహారాష్ట్ర సైబర్ సెల్ ఆమెకు సాక్షిగా విచారణకు హాజరు కావాలంటూ నోటిసులు పంపింది. ఆమె ఏప్రిల్ 29న విచారణకు హాజరవుతారు.

ఫెయిర్‌ప్లే అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో IPL 2023 ప్రమోషన్‌లలో పాల్గొంది తమన్నా. ఈ యాప్ చట్టవిరుద్ధంగా ఐపిఎల్ ను స్ట్రీమింగ్ చేయడం వల్ల IPL వాటాదారులకు 100 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ బెట్టింగ్ కేసుకు సంబంధించి సంజయ్ దత్, రాపర్ బాద్షా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో సహా పలువురు ప్రముఖులకు కూడా సమన్లు ​​అందాయి.

- Advertisement -

గోవాలో విజయ్ వర్మతో తమన్నా..

తమన్నా భాటియా 2023లో న్యూ ఇయర్‌ ను ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్లింది. ఆ తరువాత నూతన సంవత్సరం సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను తమన్నా కౌగిలించుకున్న వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అందులో ఇద్దరూ కిస్ చేసుకుంటూ కన్పించి షాక్ ఇచ్చారు. ఇదే వీరిద్దరూ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారనే పుకార్లకు కారణమైంది.

తరువాత ఈ జంట సినిమాలు, ప్రచార కార్యక్రమాలు, అనేక పార్టీలలో కలిసి కనిపించడంతో ఆ పుకార్లకు బలం చేకూరింది. సుజోయ్ ఘోష్ తెరకెక్కించిన లస్ట్ స్టోరీస్ 2 పేరుతో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్‌లో తమన్నా భాటియా, విజయ్ వర్మ కలిసి నటించారు . నటీనటులు ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు. అలాగే తమ రిలేషన్ ను అఫిషియల్ గా చెప్పేశారు కూడా.

తమన్నా బోల్డ్ సీన్లు వివాదాస్పదం

2023లో రిలీజైన రొమాంటిక్ డ్రామా జీ కర్దాలో బోల్డ్ లో నటించి షాక్ ఇచ్చింది తమన్నా. ఆ సన్నివేశాల వల్ల తమన్నాపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. తమన్నా తన కెరీర్‌లో మొదటిసారిగా ఈ సిరీస్ కోసం నో-కిస్ పాలసీని బ్రేక్ చేసింది. అప్పటిదాకా అలాంటి పనులు చేయను అంటూ చెప్పుకొచ్చిన ఏ బ్యూటీ సడన్ గా కిస్, రొమాంటిక్ సీన్స్ లో కన్పించడం ఆమె అభిమానులను పూర్తిగా షాక్‌కి గురి చేసింది. తరువాత తమన్నా కాలంతో పాటే మనమూ మారాలి అని సమాధానం చెప్పాక శాంతించారు ఆమె ఫ్యాన్స్.

తమన్నా సినిమాల విషయానికొస్తే..

సుందర్ సి దర్శకత్వంలో అరణ్మనై 4లో అనే మూవీలో రాశి ఖన్నాతో కలిసి నటిస్తోంది తమన్నా. మే 3న ఈ మూవీ తెలుగులో బాక్ పేరుతో థియేటర్లలోకి రానుంది. మిస్టీరియస్ థ్రిల్లర్ ఒడెలా-2లో శివ శక్తి పాత్రను పోషిస్తోంది తమన్నా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు