Actress Laya : అంట్లు బాగా తోముతున్నారా? లయకు ఎయిర్ పోర్ట్ లో షాకింగ్ ఎక్స్పీరియన్స్

Actress Laya : హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయం వరం మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి, అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అయిన ఈ బ్యూటీ తాజాగా హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పుడు ఎయిర్ పోర్టులో ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.

13 ఏళ్ల పాటు ఉట్టిపడే తెలుగుదనంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన తెలుగు అమ్మాయి లయ 2006లో ఓ డాక్టర్ ను పెళ్లాడింది. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయిన ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి. కూతురు వయసు 14 ఏళ్ళు కాగా, కొడుకుకు 12 ఏళ్లు. ఈ నేపథ్యంలోనే రీఎంట్రీ కి రెడీ అయిన లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చింది.

అంట్లు బాగా తోముతున్నారా ?

హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాక కస్టమ్స్ అధికారులు తనను థంబ్ అడిగారని, కానీ ఎంత ప్రయత్నించినా తన వేలిముద్రలు అక్కడ పడలేదని వెల్లడించింది. అయితే వాళ్లు చేతులు డ్రైగా ఉన్నాయేమో శానిటైజర్ వేసుకుని ట్రై చేయండి అని సలహా ఇచ్చారట. వాళ్ళు చెప్పినట్టుగానే చేసినప్పటికీ తన వేలిముద్రలు మాత్రం అందులో పడలేదట. దీంతో అమెరికాలో అంట్లు బాగా తోముతున్నారా? అని ఫన్నీగా ప్రశ్నించారట అక్కడి కస్టమ్స్ అధికారులు.

- Advertisement -

నిజానికి అమెరికాలో ఎవరి అంట్లు వాళ్ళ తోముకోవాలి అని అంటూ ఉంటారు. భారతదేశంలో లాగా అక్కడ పని మనుషులను పెట్టుకోరు. ఎంత రిచ్ అయినా ఈ పనులు మాత్రం ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి. అదే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా లయా అది నిజమేనని చెబుతూ, ఈ సంఘటనను గుర్తు చేసుకుంది. అందుకేనేమో తన చేతులు అంత డ్రైగా మారిపోయాయి అంటూ నవ్వేసింది.

నితిన్ అక్కగా..

ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన లయ ఇంస్టాగ్రామ్ లో తరచుగా రీల్స్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తాను రీఎంట్రీకి రెడీ అనే సంకేతాలను మేకర్స్ కు పంపుతోంది. ఈ నేపథ్యంలోనే నితిన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దొరికింది లయకు. యంగ్ హీరో నితిన్, సప్తమి గౌడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తమ్ముడు అనే మూవీతో లయ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ కి అక్కగా కనిపించబోతోంది లయ. ఈ సినిమా తర్వాత లయకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తమ్ముడు మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు