Tamannaah : బాలీవుడ్ నటుడితో ప్రేమాయణం

మిల్క్ బ్యూటీ తమన్నా.. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. ఎంతో మంది స్టార్ హీరోలతో ఈ బ్యూటీ ఆడి పాడింది. అంతే కాదు.. ప్రంపచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి సినిమాలోనూ ఈ మిల్క్ బ్యూటీ కీలక పాత్ర చేసింది. ఈ పాత్రకు గాను ఈమె విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరొందిన తమన్నా కు ప్రస్తుతం ఎక్కువగా అవకాశాలు రావడం లేదు.

ప్రస్తుతం తెలుగులో తమన్నాకు ఒక సినిమా మాత్రమే ఉంది. అదే చిరంజీవి భోళా శంకర్. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది ఈ భామ. బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో బోలే చుడియాన్ చిత్రం చేస్తోంది. అలాగే 2018 లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ కు కొనసాగింపుగా వస్తున్న లస్ట్ స్టోరీస్ 2 లో కూడా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో తమన్నా గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది.

లస్ట్ స్టోరీస్ 2లో తోటి నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడిందట. ఈ వార్త చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా, విజయ్ వర్మ సన్నిహితంగా ఫోటోలు వైరల్ కావడంతో వీరి ప్రేమాయణం నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ న్యూ ఇయర్ ను తమన్నా.. విజయ్ వర్మతో కలిసి గోవాలో జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

అంతే కాదు.. ఈ జంట ముంబై వీధుల్లో కూడా తెగ చక్కర్లు కొడుతున్నారు. వాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్నాయి. దీంతో విజయ్ వర్మ, తమన్నా మధ్య లవ్ ట్రాక్ ఉందని, వాళ్లు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాగా తమన్నా గురించి ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలో ఒక వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లికి సిద్ధమైంది అంటూ కూడా రూమర్స్ వచ్చిన సంగతి విధితమే. అయితే ఈ సారి విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ షిప్ లో ఉందన్న న్యూస్ నమ్మేలా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు