Tollywood Actress: ప్రతిభ ఉన్నా అదృష్టం లేక కనుమరుగైన హీరోయిన్స్ వీళ్ళే..!

ఎవరైనా సరే ఇండస్ట్రీ లోకి వచ్చి తమ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తే ఇండస్ట్రీలో కొనసాగుతారు.. అలా చేయలేకపోతే అతి తక్కువ సమయంలోనే ఫేడ్ అవుట్ అవుతారు.. కొంతమందిలో బోలెడంత టాలెంట్ ఉంటుంది.. చక్కగా నటిస్తారు.. బాగా డాన్స్ చేస్తారు.. అంతకంటే అందంగా మాట్లాడుతారు కూడా.. అందుకే వారిని ఏ సినిమాలో చూడడానికైనా ప్రేక్షకులు ఇష్టపడతారు.. పైగా వారి సినిమా వస్తోందంటే చాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు.. అలాంటి ఎంతో క్రేజ్ ఉన్న ముగ్గురు నటీమణులు తమ కెరీర్ ని తామే తెలిసి తెలిసి పోగొట్టుకోవడం అభిమానులను మరింత బాధపెడుతోంది.. ఇంతకీ అన్నీ తెలిసి కూడా అవకాశాలు రాకపోయినా పర్వాలేదని.. వారు చేస్తున్న చిన్న చిన్న తప్పులకి తమ కెరీర్నే కోల్పోయారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

నిత్యామీనన్..
మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. తన నటనతో, అందంతో, వాక్చాతుర్యంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె తన శరీరం విషయంలో మాత్రం చాలా లేజీగా మారిపోయింది. అసలు బరువు అనేది హీరోయిన్స్ కి చాలా ఇబ్బందికరమైన సమస్య . అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి మాకు టాలెంట్ ఉంది.. మేము చక్కగా నటిస్తాము అనే ఒక ఆటిట్యూడ్ తో సినిమాలు చేస్తూ వెళ్తోంది. అందువల్లే ఈమె నటిస్తున్న సినిమాల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తోంది.. ఇక ఆమె బరువే ఆమెకు దురదృష్టంగా మారి అదృష్టం లేకుండా చేస్తోందని చెప్పవచ్చు..

నివేదా థామస్:
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగువారి సొంతింటి అమ్మాయిలా మారిపోయింది. నానితో కలిసి ఎక్కువ సినిమాలలో కనిపించిన నివేదా మెల్లిగా కెరియర్ కోల్పోతూ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఆడి పాడిన ఈమె ఏదో ఒక స్టేజిలో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా బరువు పెరగడంతో ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చాలా చక్కగా డాన్స్ చేస్తుంది. అంతకంటే అందంగా కూడా ఉంటుంది. స్టార్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కానీ ఆమె బరువే ఆమె కెరీర్ కు శాపంగా మారింది ఒకవేళ బరువు తగ్గి నాజూగ్గా తయారైతే మాత్రం కచ్చితంగా మళ్ళీ సినిమాలలో బిజీ అవడం ఖాయం అని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -

అనుష్క శెట్టి..
బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి వరుసగా అవకాశాలు అందుకుంది. అలా భాగమతి , నిశ్శబ్దం వంటి సినిమాలలో చేసిన ఈమె ఆ తర్వాత చేసిన సైజ్ జీరో సినిమాతో కెరీర్ ని కోల్పోయింది. అనుకోకుండా బరువు పెరిగింది. ఆ బరువును తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు మాత్రం తగ్గడం లే.దు ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన ఈమె అందులో కూడా నాజూగ్గా కనిపించలేదుm ఇక ఈమె బరువు తగ్గితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు..

మరి వీరి ముగ్గురు తమ శరీరంలో మార్పులు తీసుకొచ్చి.. మునుపటి వైభోగాన్ని పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక మేరకైనా తమలో మార్పు తీసుకొస్తారేమో చూడాలి..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు