Saithan : హిందీలో కుమ్మేస్తున్న థ్రిల్లర్ మూవీ..

బాలీవుడ్ లో ఈ సంవత్సరం రిలీజ్ ఆయిన సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు అన్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించినా బ్రేక్ ఈవెన్ కాలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన షాహిద్ కపూర్ సినిమా హిట్ అయినా అది బాలీవుడ్ రేంజ్ కి సరికాదు. అదొక చిన్న సినిమాగా లెక్కపెట్టొచ్చు. కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ సినిమా మాత్రం బాలీవుడ్ లో అనూహ్యంగా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఆ సినిమాయే “సైతాన్”. అజయ్ దేవగన్, మాధవన్ ల కాంబినేషన్ లో వచ్చిన సైతాన్ మూవీ రీసెంట్ గా హిందీలో రిలీజ్ అవ్వగా అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా కి యావరేజ్ రివ్యూలు సొంతమైనా ఆడియన్స్ నుండి మౌత్ టాక్ తో దూసుకుపోతుంది.

మాధవన్ హైలెట్..

ఇక సైతాన్ సినిమా గుజరాతి మూవీ అయిన వష్ కి రీమేక్ గా తెరకెక్కగా, ఈ సినిమా డ్రామా పరంగా మంచి థ్రిల్ ని ఇస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన మాధవన్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచిందని ఆడియన్స్ అంటున్నారు. ఒక అమ్మాయిని వశపరుచుకొని తల్లితండ్రులను భయపెడుతూ క్రూరత్వంతో నిండిన విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. ఇక అజయ్, జ్యోతిక తమ పరిధి మేరకు వారి పాత్రల్లో చక్కగా నటించినా… సినిమా చూసిన తర్వాత మాధవన్ పాత్ర మాత్రమే గుర్తుంటుంది. పైగా టైటిల్ రోలే మాధవన్ పోషించడం విశేషం.

- Advertisement -

వీకెండ్ లో జోరు..

సైతాన్ సినిమా శుక్రవారం రిలీజ్ అవగా, ఓవర్సీస్ నుండే మంచి టాక్ ప్రీమియర్స్ కే అంతటా స్ప్రెడ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఈ టాక్ ప్లస్ అయ్యి అన్ సీజన్ అనుకున్న మార్చ్ లో కూడా ఈ సినిమాకి సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతుంది. ఇక సైతాన్ సినిమా ఫస్ట్ డే 15.21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా రెండో రోజు మంచి గ్రోత్ చూపించి 19.18 కోట్ల రేంజ్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు ఏకంగా 21 కోట్ల రేంజ్ లో ఉండగా వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా 55 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సెన్సేషన్ అయింది.

ఎక్స్పెరిమెంటల్ మూవీతో మరోసారి రచ్చ..

బాలీవుడ్ లో మామూలుగా కమర్షియల్ మూవీ కి ఇలాంటి కలెక్షన్స్ అంటే మామూలుగానే వస్తూ ఉంటాయి. కానీ ఎక్స్ పెరిమెంటల్ కథకి ఆడియన్స్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తూ ఉండటం అరుదు. అయితే లాస్ట్ ఇయర్ కూడా అజయ్ దేవగన్ ఇలాగే దృశ్యం రీమేక్ తో వచ్చి ఏకంగా 300 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ సైతాన్ అంటూ ఎక్స్పెరిమెంటల్ మూవీతో వచ్చి భారీ వసూళ్లు సాధిస్తుండడం విశేషం. సైతాన్ సినిమా వసూళ్లు ఇలాగే ఉంటే లాంగ్ రన్ లో 200 కోట్లకు పైగా కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు