Taapsee Pannu: నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు… అప్పుడే పెళ్లేంటి?

Taapsee Pannu

సొట్ట బుగ్గల హీరోయిన్ అంటే, సినిమా ఇండస్ట్రీలో కొంత మంది ఫేస్‌లు ప్రేక్షకుల ముందుకు ఆటోమెటిక్ గా కనిపిస్తాయి. అలా వచ్చే వారిలో Taapsee Pannu ఒకరు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ ఉన్న సమయంలో బాలీవుడ్ గడప తొక్కిన ఈ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా కలిసి రావడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పద్దతిగా కట్టు బొట్టుతో అలరించిన సమయంలో అవకాశాలు వచ్చాయి. కానీ, బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత మోడ్రన్ డ్రెస్‌లు, బోల్డ్ సీన్స్ లు చేసినా ఛాన్స్ లు రావడం లేదు.

ఇది ఇలా ఉండగా, తాప్సీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. అది తన సినిమాలతో కాదు.. ఆమె చేసే వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల కాలంలో టాలవుడ్ డైరెక్టర్లపై, హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాప్సి, తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పింది. తాప్సి తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ సెషన్ చేసింది. ఇందులో మొదట.. రొటీన్ ప్రశ్నలు కాకుండా, కాస్త కొత్తగా ట్రై చేయండి అంటూ ఒక కండీషన్ కూడా పెట్టింది.

దీంతో నెటిజన్లు రెచ్చిపోయి మరీ ప్రశ్నలు వేశారు. దీనికి Taapsee Pannu కూడా ఎక్కడా తగ్గకుండా సమాధానాలు చెప్పింది. అసలే ఈ మధ్య కాలంలో ఫైర్ బ్రాండ్ అంటూ పేరు తెచ్చుకుంటున్న తాప్సి సమాధానాలు ప్రస్తుం వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ చాట్ సెషన్ లో ఒక నెటిజన్.. పెళ్లి గురించి ప్రస్తావించాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని తాప్సిని డైరెక్ట్ గా అడిగాడు. దీనికి తాప్సి “నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు… కాబట్టి నా పెళ్లి గురించి నేను ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పింది.

- Advertisement -

ఈ సమాధానం బాలీవుడ్ హీరోయిన్లకు కౌంటర్ గా ఉంది అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ లో హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం తెచ్చుకుంటున్నారు. అలియా భట్, ఇలియానా, నేహా ధూపియా నే కాకుండా చాలా మంది హీరోయిన్లు ప్రెగ్నెంట్ అయ్యాకా, పెళ్లీలు చేసుకున్నారు. వారికి సైటైర్ వేస్తూ తాప్సి ఈ వ్యాఖ్యలు చేసింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు టాలీవుడ్ ను టార్గెట్ చేసిన ఈ సొట్ట బుగ్టల ముద్దుగుమ్మ Taapsee Pannu .. ఇప్పుడు బాలీవుడ్ పై పడింది అంటున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు