Sree vishnu: స్టార్ హీరోల రికార్డ్స్ ను టచ్ చేసిన చిన్న సినిమా

కంటెంట్ సాలిడ్ గా ఉండాలి గాని చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే తేడాలేవి చూడకుండ ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. ఇటీవలనే అసలేమాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా స్టార్స్ కూడా లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాల్ని అందుకుంటుంది.

శ్రీ విష్ణు హీరోగా, రెబా మోనికా జాన్ హీరోయిన్ గా, సీనియర్ యాక్టర్ నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 28న విడుదలై, ఇప్పటి వరకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రెజెంట్ చేయగా, హాస్య మూవీస్ రాజేష్ దండ ఈ సినిమాని నిర్మించారు.

సామజవరగమన సినిమాకు ముందు శ్రీ విష్ణు నటించిన అల్లూరి సినిమా రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమా మార్కెట్ చేయడం చాలా కష్టం అయింది. మొత్తానికి ఎలాగోలా కష్టపడి మూవీ యూనిట్ ఈ సినిమాను రిలీజ్ చేయగా, అందరి అంచనాలను తలక్రిందులు చేసేలా సామజవరగమన బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

- Advertisement -

ఇప్పటి వరకు ఈ సినిమా 47 కోట్ల వరకు వసూలు చేయగా, సినిమా ఫుల్ రన్ ఈజీ గా 50 కోట్ల మార్క్ టచ్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కేవలం ఈ సినిమా ఏపీ, తెలంగాణాలో మాత్రమే కాదు యూఎస్ లో కూడా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవలనే సామజవరగమన యూఎస్ లో 1 మిలియన్ మార్క్ ను టచ్ చేసి, పాజిటివ్ టాక్ సక్సెస్ ఫుల్ గా ప్రదరించబడుతుంది. కేవలం స్టార్ట్ హీరోల సినిమాలు మాత్రమే సొంతమైన ఈ రికార్డ్ ఈ ఇప్పుడు శ్రీ విష్ణు కూడా సామజవరగమన సినిమాతో 1 మిలియన్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే సినిమా స్టార్స్ కంటే కూడా కంటెంట్ ఉండటమనేది ముఖ్యం అని స్పష్టమవుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు