Pawan kalyan: “బ్రో” సినిమాపై కేతిక శర్మ హాట్ కామెంట్స్?

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ “బ్రో”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

కేతిక శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేతిక శర్మ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

“ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రో సినిమా నేను ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం పవన్ కళ్యాణ్. ఆయన సినిమా అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనే పేరు వింటే చాలు. రంగ రంగ వైభవంగా సినిమా చివరి దశలో ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాను. కానీ ఈ సినిమాలో పవన్ తో నాకు సీన్లు లేవు. స్క్రీన్ స్పేస్ లో మాత్రమే ఉన్నాను. కానీ ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. పవన్ ని నేరుగా కలవాలంటే చాలా భయమేసింది. సాయి ధరమ్ తేజ్ చెబితే నన్ను తీసుకువెళ్లి ఆయనకు పరిచయం చేశారు. కానీ ఆయనతో సీన్లు లేకపోవడం వల్ల ఎక్కువగా కలవలేకపోయాను. కానీ ఆరోజు ఆయనతో మాట్లాడిన ఆ ఐదు నిమిషాలు మాత్రం మంచి అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమాలో నేను సాయిధరమ్ తేజ్ పోషిస్తున్న మార్క్ కి ప్రేయసిగా కనిపిస్తాను” అని చెప్పుకోచ్చింది

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు