Sanya Thakur: బంపర్ ఆఫర్ కొట్టేసిన స్పై బ్యూటీ

ఇటీవలనే నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు పరిచమైన సన్యా ఠాకూర్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమె కంటే కూడా సన్యా ఠాకూర్ కె ఎక్కువ గుర్తింపు లభించింది.

స్పై సినిమాలో ఆమె ఏజెంట్ సరస్వతి అనే పాత్రలో నటించగా, ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానికి తోడు ఈ బ్యూటీ స్పై సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేసింది. తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, టాలీవుడ్ నా హార్ట్ తో సమానమని ఆమె చేసిన పలు వ్యాఖ్యలు నెట్ లో వైరల్ అయిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన స్పై మూవీ ఆశించినంత విజయం సాధించక పోవడంతో సన్యా ఠాకూర్ టాలీవుడ్ లో పాగా వేయలేకపోయింది.

అయితే లేటెస్ట్ గా ఈ బ్యూటీ మరో పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నంద కీషీర్ దర్శకత్వంలో ‘ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా వృషభ అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఏవీఎస్ స్టూడియోస్, ఫస్ట్ స్టెప్ మూవీస్, బాలాజీ టెలిఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిచబోతున్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనల్ చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా కీ రోల్ పోషిస్తున్నాడు. రోషన్ కు జోడిగా ఈ సినిమాలో సన్యా ఠాకూర్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబందించి మిగితా వివరాలు తొందర్లోనే వెల్లడి కానున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు