Taapsee : ‘నా శృంగార జీవితం ఆసక్తికరంగా లేదు’

కాఫీ విత్ కరణ్ షో అంటే తెలియని వారుండరు. ఈ షోను బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ రన్ చేస్తున్నారు. బాలీవుడ్ నటీ నటులు చేసే సినిమాలను ఈ షోలోకి వచ్చి ప్రమోషన్స్ చేస్తారు. ఈ షో నుంచి ప్రస్తుతం ఏడో సీజన్ స్ట్రీమింగ్ అవుతుంది. కొన్ని వారాల నుంచి హాట్ స్టార్ లో వస్తుంది. ఇప్పటి వరకు జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్-సమంత, విజయ్ దేవరకొండ-అనన్య పాండే తో పాటు ఇటీవల కరీనా కపూర్-అమీర్ ఖాన్ ఈ షోకు వెళ్లారు. వీళ్లు పాల్గొన్న ప్రతి ఎపిసోడ్ లో కరణ్ జోహార్ వ్యక్తిగత ప్రశ్నలు వేశారు. విజయ్ దేవరకొండ-అనన్య పాండే లపై అయితే ఏకంగా శృంగారంపై ప్రశ్నలు సంధించారు. దీనిపై చాలా వ్యతిరేకత వచ్చింది. కొంతమంది సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందించారు.

తాజాగా హీరోయిన్ తాప్సి కూడా ఈ షోపై స్పందించింది. తాప్సి నటించిన దోబారా అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి.. ”మీకు కాఫీ విత్ కరణ్ షో నుంచి ఆహ్వానం రాలేదా. ఆ షోలో సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా అవుతున్నాయి కదా” అని అడిగాడు. దీనికి సమాధానంగా తాప్సి ”కాఫీ విత్ కరణ్ షోకు ఆహ్వానించేలా నా శృంగార జీవితం ఆసక్తికరంగా లేదు” అని బదులు ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లు అంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఒక్క నిమిషం తర్వాత అర్థమైంది.. కాఫీ విత్ కరణ్ షోకు హీరోయిన్ తాప్సి కౌంటర్ ఇచ్చారని. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో కాఫీ విత్ కరణ్ షోపై చర్చ మరోసారి జోరందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు