Tees Maar Khan : అమ్మపై ప్రేమతో ” తీస్ మార్ ఖాన్”

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆది సాయికుమార్. ఆది డేబ్యూ మూవీ “ప్రేమ కావాలి” మాత్రమే కెరీర్ లో హిట్ ని నమోదు చేసింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది, అప్పటి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆది నటించిన చిత్రం ” తీస్ మార్ ఖాన్”. ఈ చిత్రానికి కళ్యాణ్ గోగన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆదికి జంటగా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. సునీల్, పూర్ణ, కబీర్ ఖాన్, ఠాకూర్ అనుదీప్ సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ రూత్ లెస్ పోలీసు అధికారిగా కనిపిస్తున్నాడు.

ఈ చిత్రం ఆగస్టు 19న పరీక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హాట్ హాట్ సన్నివేశాలతో రచ్చ చేసినట్లు ట్రైలర్ తో స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ ట్రైలర్ లో మొదట హీరో చిన్నప్పటి పాత్రలో “మా అమ్మని తప్పుగా చూసారు.. మా అమ్మ జోలికి వస్తే ఏ అమ్మ కొడుకు అయినా కొడుతా” అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. హీరో, విలన్ మధ్య సాగే సన్నివేశాలు సినిమాపై ఆసక్తి ని పెంచుతున్నాయి. చివరగా మీ టీఎంకే అని స్టైలిష్ గా చెబుతూ ఆగస్టు 19న థియేటర్స్ లో కలుద్దాం అన్నారు ఆది సాయికుమార్. కానీ, ఈ సినిమా ప్రేక్షకుల టెస్ట్ గా ఉంటుందా అని డౌట్ మాత్రం ట్రైలర్ చూస్తే వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు