SSMB29:సూపర్ స్టార్ కు తండ్రి పాత్రలో బిగ్ బి?

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కాబోతుంది. దీని తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడు. SSMB29 అంటూ అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అలాగే అనేక సందర్బాల్లో డైరెక్టర్ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమాకు సంబంధించిన స్టోరీపై కొన్ని క్లూస్ కూడా ఇచ్చారు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఉండే అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుందని చెప్పారు. అలాగే ఇండియన్ జోన్స్ అనే హాలీవుడ్ సినిమాలా ఉంటుందని రాజమౌళి చెప్పాడు. అయితే ఇంకా స్టోరీ పూర్తిగా కాలేదని స్వయంగా విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు. స్టోరీ పూర్తి కాక ముందే ఈ చిత్రానికి సంబంధించి అనేక రూమర్స్ వస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. దీంతో ఈ పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను తీసుకోవాలిని విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి భావిస్తున్నారని టాక్. అలాగే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ను మహేష్ కు జోడీగా ఎంపిక చేయాలని చూస్తున్నట్టు వినిపిస్తుంది. అయితే ఈ వార్త నిజమని మాత్రం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు