Puri Jagannadh: సల్మాన్ ఖాన్ వద్దకు చేరిన ఆటో జానీ?

లైగర్ తర్వాత టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ట్రబుల్ అవుతున్నారు. ఆర్థికంగా, కెరీర్ పరంగా పూరి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అందు కోసం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్లాడు. చిరుతో పూరి ఇది వరకే ఆటో జానీ అనే సినిమా చేయాల్సింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాని చివరికి వివి వినాయక్ తో చిరు సినిమాను సెట్ చేసుకున్నారు.

అయితే అప్పుడు మిస్ అయిన కాంబినేషన్ తాాజాగా ఇప్పుడు సెట్ చేయాలని ప్లాన్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. చిరు, పూరి కాంబినేషన్ లో సినిమా రావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే ముందుగా అనుకున్న ఆటో జానీ స్టోరీతో కాకుండా.. కొత్త స్టోరీతో ఈ కాంబో వస్తుందని తెలుస్తుంది. అయితే ఆటో జానీ స్టోరీ తనకు కాకుండా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బాగా సెట్ అవుతుందని చిరంజీవి భావిస్తున్నాడట.

అంతే కాదు.. స్వయంగా సల్మాన్ కు ఫోన్ చేసి ఆటో జానీ గురించి, పూరి గురించి చెప్పాడని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మెగాస్టార్ కుటుంబానికి, సల్మాన్ కు మధ్య ఉన్న సన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ సన్నిహిత్యంతోనే మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించారు. అయితే ఇప్పుడు కూడా చిరు కోరికను సల్మాన్ కాదనలేరని టాక్. త్వరలోనే పూరి, సల్మాన్ కలిసి ఆటో జానీ స్టోరీపై చర్చించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు