Virupaksha: టైటిల్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్

హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ని నిర్ణయించారు. గత బుధవారం ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రచార చిత్రానికి స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం. రీసెంట్ గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ నుండి రేపు టైటిల్ గింప్స్ రాబోతుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రేపు ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ మూవీలో తేజుకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తుంది. ఇక ఈ కథ విషయానికి వస్తే, 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్ లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు