SSMB28 : మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా టీజర్ అప్డేట్

మహేష్ బాబు ఫ్యాన్స్ అంత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. త్రివిక్రమ్ ,మహేష్ బాబు కాంబినేషన్ లో  వస్తోన్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు, ఖలేజా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత త్రివిక్రమ్, మహేష్ కలిసి చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాకి సంబంధించి గత కొద్దీ రోజులుగా ఇండస్ట్రీలో పలు రకాల రూమర్స్ వినబడుతున్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తిగా కంప్లిట్ చేయకుండానే మహేష్ కి చెప్పి షూటింగ్ స్టార్ట్ చేసాడని, అందుకే సినిమా షూటింగ్ లేట్ అవుతోందని పైగా త్రివిక్రమ్ .. మహేష్ సినిమాకంటే పవన్ కళ్యాణ్ సినిమాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతుండటం వల్ల సినిమాకి సంబంధించి న్యూస్ ఏది రావట్లేదు అని రూమర్స్ వస్తున్నాయి.

ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రొడ్యూసర్ నాగ వంశీ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. “రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి అవి రానియ్యండి. మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అనుకున్న టైంకి 2024 జనవరిలో సినిమా రిలీజ్ చేస్తాం. మీకు బాబు ఫస్ట్ లుక్ నచ్చింది కదా, సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. వచ్చే నెల మేలో మీకు అందరికి అదిరిపోయే అప్డేట్ వస్తుంది” అని ట్వీట్ చేసారు.

- Advertisement -

మే నెలలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు ఉంది. కాబట్టి ఆ రోజు టీజర్ రిలీజ్ చేస్తాం అని చెప్పకనే చెప్పారు నాగ వంశీ. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుంది. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైఎస్ రాధాకృష్ణ మరియు నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు