Sriwaas: రామబాణానికి సెన్సార్ సర్టిఫికెట్.. ఒక్క కట్ కూడా లేదు

మాస్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రామబాణం. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు వీరి కలయిక లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. రామబాణం చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మించగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. మే 5 న విడుదల అవుతున్న ఈ సినిమా కి సంబంధించి ప్రమోషన్లు జోరందుకున్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లు ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి. ఇక ఈ సినిమా కు సంబంధించి తాజాగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. రామబాణం సినిమాకి గాను సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించింది. అయితే ఈ సినిమాలో ఒక్క సీన్ కట్ చేయకుండా ఒక్క డైలాగ్ ని కూడా మ్యూట్ చేయకుండా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. అయితే సెన్సార్ సభ్యులు ఒక్క కట్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం చాలా అరుదు.

ఇక రామబాణం సినిమా లో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, ఖుష్బూ, నాజర్, శుభలేఖ సుధాకర్, అలీ, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ల లో భాగంగా హీరో గోపిచంద్ ఏప్రిల్ 26 న అభిమానులతో ఫోటో షూట్ లో పాల్గొనడం జరిగింది. త్వరలోనే రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కూడా జరుపనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా చిరంజీవి లేదా ప్రభాస్ రానున్నారని సమాచారం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు