SSMB -29: కథ రివీల్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

SSMB -29: ప్రస్తుతం ప్రపంచం మొత్తం రాజమౌళి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి, మహేష్ బాబు తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ ని తీస్తున్నాము అంటూ ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాతోనే మహేష్ బాబు పాన్ ఇండియా రేంజ్ లో అడుగు పెడుతున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీగా అంచనాలను పెట్టుకోవడం గమనార్హం . ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయిందని ప్రకటించిన విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో SSMB 29 మూవీ పై పలు ఆసక్తికర విషయాలు పెంచుకున్నారు.

మహేష్ – రాజమౌళి సినిమా ” ఇండియానా జోన్స్ “లా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్టుకి ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదని తెలిపారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కథ అడవి నేపథ్యంలోనే ఎక్కువగా సాగుతుందని కూడా తెలిపారు. ఇక ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు విజయేంద్ర ప్రసాద్. మొత్తానికైతే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో షార్ట్ గా చెప్పి అందరికీ అంచనాలను పెంచేశారు విజయేంద్రప్రసాద్.. అంతే కాదు ఈ సినిమాతో మహేష్ బాబుకి పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ పెరుగుతుందని కూడా వెల్లడించారు.

ఇకపోతే ఇప్పటివరకు తన సినిమాలను తెలుగు తెరకే పరిమితం చేసిన మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందాలని ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే . మరి ఈ సినిమాతో ఆయన గ్లోబల్ స్టేటస్ అందుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టు ఇండియానా జోన్స్ తరహా మూవీలు ఎలా ఉంటాయంటే.. యాక్షన్ అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాల ద్వారా రూ.15 వేల కోట్లు కలెక్షన్స్ కూడా వచ్చాయి. 1981 లో రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ తో మొదలైన ఈ ఫ్రాంచైజీలో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి.. ఈ సీరీస్ లో ఆఖరి సినిమా కూడా 2023లో విడుదలయ్యింది.

- Advertisement -

ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అంతే కాదు ఈ ఇండియానా జోన్స్ అన్ని సిరీస్ లకు కూడా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించారు. ఇక రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్ కూడా ఇతనే అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఈ తరహాలోనే మహేష్ బాబుతో మూవీ తెరకెక్కించాలని చూస్తున్నారు రాజమౌళి. మొత్తానికైతే ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నారని చెప్పవచ్చు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు