Pragathi: మరో అవార్డు అందుకున్న ప్రగతి.. వాళ్ల నోళ్ళు మూయించిందిగా..!

Pragathi: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటి ప్రగతి కూడా ఒకరు.. మొదట హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది.. ఎక్కువగా అత్త , వదిన, అమ్మ పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నా .. సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడం తో ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టి..ఐదు పదుల వయసులో కూడా జిమ్ వర్కౌట్ లు చేస్తూ పలు రకాల వీడియోలను, ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది..

అయితే ప్రగతి ఇదంతా కేవలం తన ఫిట్నెస్ కోసమే చేస్తోందంటూ అందరూ అనుకునేవారు.. చాలామంది ఈమెను ఎన్నో సందర్భాలలో ట్రోల్ చేయడం కూడా జరిగింది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ప్రగతి తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది. రూమర్స్ కి చెక్ పెట్టాలనుకున్న ప్రగతి ఇటీవల.. బెంగళూరులో జరిగిన 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీ లో పాల్గొనింది.. అక్కడ పాల్గొనడమే కాకుండా ఏకంగా మూడవ స్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇప్పుడు మళ్లీ మరొకసారి వెయిట్ లిఫ్టింగ్ లో అవార్డును కూడా అందుకుంది ప్రగతి.. సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని అందరి నోళ్ళు మూయించింది. అంతేకాదు వెండి పతాకాన్ని అందుకున్నానో అంటూ ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అలాగే అందులో బరువులు ఎత్తిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఆ తర్వాత తన సిల్వర్ మెడల్ అందుకున్నట్లుగా ఈ వీడియోలో చూపిస్తోంది.

- Advertisement -

https://www.instagram.com/reel/C2XselHS0tm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Pragathi received another award.. their mouths are closed..!

Pragathi received another award.. their mouths are closed..!

ఈ వీడియో చూసిన అభిమానులు సైతం ప్రగతికి హ్యాండ్సప్ చేస్తున్నారు. మరి కొంతమంది సినీ ప్రేక్షకులు ఈమెను ప్రశంసిస్తూ ఉన్నారు .ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొకపక్క ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ పైన పట్టు సాధించి ఎన్నో రకాల అవార్డులను అందుకోవడం అంత ఆషామాషి విషయం కాదంటూ ఈమెను పొగిడేస్తూ ఉన్నారు. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటూ ప్రగతి నిరూపించిందని పలువురు అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు