Tollywood: “నాటు నాటు”కు స్టెప్పులేసిన ఆ దేశ సైనికులు

ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలు గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. 2022 సమ్మర్ లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘానా విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఎన్నో అవార్డులను రివార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో  “నాటు నాటు” గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఇప్పుడు ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారు. ఇటీవలే నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా లభించిన విషయం తెలిసిందే.

అయితే నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రజాదరణ పొందగా ఇప్పుడు ఆ పాట షూట్ చేసిన దేశంలో మరింత పాపులర్ అయింది. అయితే నాటు నాటు పాట ఉక్రెయిన్ దేశంలో షూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలోని ఆర్మీ సైనికులు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. తాజాగా ఈ వీడియో RRR చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్మీ ఆఫీసర్లు డ్రోన్ల సహాయంతో ఓ ప్రయోగాన్ని చేశారు. దీనికి RRR మూవీలోని నాటు నాటు పాటను వాడుకున్నారు. ఇందులో మగవారితో పాటు లేడీస్ కూడా పాల్గొన్నారు. ఈ వీడియోను ఆ దేశ ప్రముఖులు ట్వీట్ చేశారు. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది. అదీగాక ఉక్రెయిన్ లో RRR షూటింగ్ చాలా భాగం తెరకెక్కగా, అక్కడ షూటింగ్ కు అక్కడి ఆర్మీ వాళ్ళు బాగా సహాయం చేసారని చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాక ఉక్రెయిన్ రష్యా వార్ సమయంలో అందుకే కొందరు సైనికులకు వారి కుటుంబాలకు రామ్ చరణ్ సహాయం కూడా చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు