Yodha OTT: ఎట్టకేలకు ఫ్రీ గా ఓటీటీలోకి వచ్చేసిన యోధా మూవీ…!

Yodha OTT: బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కిరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యోధ. ఈ సినిమాతో సాగర్ అంబ్రే – పుష్కర్ ఓజ హిందీ పరిశ్రమకు పరిచయమైంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. టాలీవుడ్ బ్యూటీ రాశి కన్నా, హిందీ హాట్ భామ దిశా పటాని ముఖ్యపాత్రలు పోషించిన ఈ మూవీ మార్చ్ 15న థియేటర్లలో విడుదలైంది.

యాక్షన్ చిత్రంగా రూపొందిన యోధ సినిమాకు ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి అంటూ పలువురు కామెంట్స్ చేశారు కూడా. ఈ మూవీ రూ. 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి దాదాపు రూ. 53 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా నిర్మాతలకు రూ. రెండు కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు సమాచారం.

yodha-ott-details
yodha-ott-details

భారీ అంచనాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ మూవీ నిరాశపరచడంతో ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 26 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతుంది ఈ మూవీ. కానీ అది రెంటల్ విధానంలో సినిమాను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫ్రీగా కాకుండా రూ. 349 చార్జీ చెల్లించి సినిమాను ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు సదరు ఓటీటీ సంస్థ. ఇక మే 15 నుంచి ఈ సినిమాను ఫ్రీగా ఓటిటి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ తేదీ కంటే ముందుగానే ఓటీటీలో యోధ ను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు