చేసింది తక్కువ సినిమాలే అయిన ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది శోభిత ధూళిపాళ. అందులో కొంత క్రేజ్ సినిమాలతో వస్తే, మరికొంత క్రేజ్.. అక్కినేని వారసుడు నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ గా నిలిచిన ఈ బ్యూటీ, సిల్వర్ స్క్రీన్ పై కనిపించడానికి ఎంతో సమయం తీసుకోలేదు. ముందుగా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన ఈ రూమర్డ్ క్వీన్ ప్రస్తుతం సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. ఈమె ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ -1, పొన్నియిన్ సెల్వన్ -2 తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదే సమయంలో నాగ చైతన్యతో కలిసి ఓ రెస్టారెంట్ కలిసి ఉన్న ఫోటో వైరల్ కావడంతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.
అయితే ఈ బ్యూటీ సినిమాల్లో కనిపించడంతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను పెడుతూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాలో అదిరిపోయే ఫోటోలను పెట్టింది. ఈ ఫోటోల్లో వైట్ కలర్ శారీతో ఉంది. ఆ వైట్ శారీ ట్రెడీషనల్ లుక్ తో ఉన్నా.. కొంగు చాటు నుంచి నాభీ అందాలను చూపించిన తీరుకు కుర్రకారు ఫ్లాట్ అవుతున్నారు. అలాగే ఆమె హావాభావాలు మొహం తిప్పుకోకుండా చేస్తున్నాయి.
ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. సమంతకు ఏ మాత్రం తీసిపోని అందమని, నాగ చైతన్యకు సరిగ్గా సెట్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శోభిత ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్-02 హిట్ ను ఎంజాయ్ చేస్తుంది. దీని తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు చేస్తుంది.