Tollywood: డిఫెరెంట్ జోనర్లో స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్.. ఫన్ గ్యారెంటీ

టాలీవుడ్ లో కామెడీ జోనర్ లో వస్తున్న సినిమాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. కామెడీయే ప్రధానాంశం గా కొన్ని సినిమాలు ఈ ఏడాది మంచి విజయం సాధించాయి. బలగం, దాస్ కా ధమ్కీ, మేం ఫేమస్, తాజాగా సామజవరగమన ఈ సినిమాలన్నీ విభిన్న కోణాల్లో తీసినా కామెడీయే ప్రధానంగా సాగుతాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఈ ఏడాది పెద్ద హిట్టయ్యాయి. అలాంటి సినిమాయే ఇప్పుడు ఒకటి రాబోతుంది. అదే “స్లమ్ డాగ్ హస్బెండ్”.

సంజయ్ రావు, ప్రణవి హీరో, హీరోయిన్లుగా A.R శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన కొత్త చిత్రం “స్లమ్ డాగ్ హస్బెండ్”. GSK మీడియా, Mic మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఫుల్ కామెడీ తో ఉండి ఆకట్టుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ట్రైలర్ ను అఫిషియల్ గా రిలీజ్ చేసారు.

జాతకాల దోషం వాళ్ళ కుక్కను పెళ్ళిచేసుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. ఆ కుక్కను పెళ్లిచేసుకున్న తర్వాత హీరోయిన్ ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడు. దానికి ఎవరు అడ్డుకున్నారు. ఫైనల్ గా హీరో సమస్యకి పరిష్కారం అయ్యిందా? లేదా? అన్నదే కథ. ట్రైలర్ లోనే దాదాపు కథ చెప్పినా కాన్సెప్ట్ బాగుండడంతో థియేటర్ లో మెప్పించడం దాదాపు ఖాయమేనని అనిపిస్తుంది.

- Advertisement -

ఇక ఈ సినిమాలో ఆ కుక్క పాత్రకి వెన్నెల కిషోర్ డబ్బింగ్ చెప్పగా, బ్రహ్మాజీ, సునీల్, అలీ, సప్తగిరి, ఫిష్ వెంకట్, యాదమ్మ రాజు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను జులై 21న థియేటర్లలో విడుదల చేస్తున్నామని ట్రైలర్ లో చెప్పారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు