Megastar: ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వనున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో తమిళ్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు ఏ సినిమా చేయనున్నాడు అన్న అంశం మీద అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత కొంత కాలంగా చిరు పలువురు యువదర్శకులను లైన్లో పెట్టాడని వార్తలు ఉన్నప్పటికీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే లేదు. ఈ క్రమంలో చిరంజీవి పుట్టినరోజున తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం అందుతోంది. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చేయబోయే సినిమా గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో చిరంజీవి మిడిల్ ఏజ్ క్యారెక్టర్లో కనిపించనుండగా సిద్దు జొన్నలగడ్డ చిరుకి కొడుకుగా కనిపించనున్నాడట. చిరు సరసన హీరోయిన్ గా త్రిష నటించబోయే ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందని సమాచారం. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ ప్రభావంతో సీనియర్ డైరెక్టర్స్ జోలికి వెళ్లకుండా యువ దర్శకులకు ప్రాధాన్యం ఇస్తున్న చిరు మరో యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో కూడా సినిమా చేయనున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.

సుమారు 17ఏళ్ళ తర్వాత చిరు, త్రిష కాంబినేషన్ స్క్రీన్ పై సందడి చేయనుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. పైగా ఇప్పటిదాకా రొటీన్ కథలతో సినిమాలు చేస్తూ అభిమానులను నిరాశ పరిచిన చిరు, ఈ సినిమా ద్వారా తన వయసుకి తగ్గ పాత్రను ఎంచుకోవటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు భోళాశంకర్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు