Samajavaragamana: మరో ప్రయోగం చేయనున్న శ్రీవిష్ణు…!

ఎంటర్టైన్మెంట్ తో పాటు పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీవిష్ణు, మోనికా రెబా హీరో హీరోయిన్లుగా నటించిన ‘సామజవరగమన’ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీవిష్ణు గత రెండు సినిమాలు సీరియస్ కథతో వచ్చి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయారు. మళ్లీ తన జానరైన క్లీన్ కామెడీతో వచ్చి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవిష్ణు తన నెక్స్ట్ సినిమా విషయంలో ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. ఆ మధ్య శ్రీవిష్ణు నటించిన ‘రాజరాజ చోర’ సినిమాకు ప్రీక్వెల్ చేయనున్నట్లు తెలిపాడు శ్రీవిష్ణు.

ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా డీసెంట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఇందులో శ్రీవిష్ణు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా చెలామణి అవుతూ దొంగతనాలు చేసే యువకుడి పాత్రలో మెప్పించాడు. క్లీన్ కామెడీతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ స్టోరీ ప్రీక్వెల్ చేయాలంటే బహుశా శ్రీవిష్ణు దొంగగా మారటానికి దారి తీసిన పరిణామాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.

మొత్తానికి కొంత గ్యాప్ తర్వాత తనదైన క్లీన్ కామెడీ సినిమాతో వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న శ్రీవిష్ణు తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాజరాజ చోర ప్రీక్వెల్ తర్వాత శ్రీవిష్ణు హుషారు ఫేమ్ హర్షతో ఒక సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ స్టోరీ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు