Sita Ramam: వినోదం కాదు అనుభూతి

కొన్ని సినిమాలు మనుసు లోతుల్లోకి ప్రయాణిస్తాయి.
హను రాఘవపూడి తెరకెక్కించిన “సీతా రామం” చిత్రం అచ్చం అలాంటిందే. హను వెండితెరపై గీసిన అద్భుతమైన చిత్రానికి రోజురోజుకి ఆదరణ పెరుగుతుంది. సాధారణంగా ప్రశంసలు వచ్చే చిత్రానికి కలక్షన్స్ తక్కువగా వస్తుంటాయి. కానీ చాలా తక్కువ సార్లు మాత్రమే ప్రశంసలు తో పాటు మంచి కలక్షన్స్ వస్తుంటాయి. అలాంటి సినిమానే సీతారామం.

తాజాగా సీతారామం సినిమాపై భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సినిమా గురించి ఆయన పెట్టిన రెండు ట్వీట్లు వెలకట్టలేనివి.

“సీతారామం” చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది.

- Advertisement -

మరో ట్వీట్‌లో, నాయుడు చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూస్తున్నట్లు అనిపించిందని మరియు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వినీదత్ మరియు అతని కుమార్తె స్వప్నతో సహా బృందానికి అభినందనలు తెలిపారు.

మాములుగా సినిమా అంటే వినోదం అని చాలామంది చెబుతారు, కానీ సినిమా అంటే అనుభూతి కూడా అని కొన్ని సినిమాలు నిరూపిస్తాయి. వీటిలో ఎక్కువశాతం ప్రేమకథా చిత్రాలుంటాయి. అలానే సీతారామం చిత్రం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు