Censor : లైగర్ కు షాక్

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. లైగర్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్యకృష్ణ నటించారు. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మీ తో పాటు కరణ్ జోహర్ కూడా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఫ్యాన్ డమ్ టూర్ పేరుతో దేశంలో కీలక నగరాల్లో ఈవెంట్లు జరిపారు. దీని వల్ల కూడా ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కు వెళ్లింది. అయితే ఇక్కడ లైగర్ కు సెన్సార్ బోర్డు నుంచి పెద్ద షాక్ తగిలింది. లైగర్ కు సెన్సార్ బోర్డు సభ్యులు 7 కట్స్ చెప్పారట. దీనికి సంబంధించిన రిపోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభ్యంతరంగా ఉన్న 7 సన్నివేశాల్లో కొన్ని పూర్తిగా తొలగించాలని, మరి కొన్ని చోట్ల మ్యూట్ పెట్టాలని సెన్సార్ బోర్డు సభ్యులు సూచించారట. దీనిలో F*** అనే పదం ఎక్కువ సార్లు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పదం వచ్చిన ప్రతిసారి మ్యూట్ వేయాలని కూడా సూచించారని సమాచారం అందుతుంది.

కాగా పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే బోల్డ్ సన్నివేశాలు, పదాలు వస్తుంటాయి. బిజినెస్ మెన్ వంటి సినిమాల్లో ఇలాంటివి చూశాం. అందులో కూడా చాలా సన్నివేశాల్లో సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా లైగర్ కు కూడా అదే జరుగుతుంది. అయితే 7 కట్స్ వస్తే సినిమా ఎలా ఉంటుందో అని టెన్సన్ అభిమానుల్లో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు