shruthi hassan: నా కెరీర్ కు అదే ప్లస్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తమిళ సినిమాల ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన శృతిహసన్ , సిద్దార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ ని సృష్టించుకుంది.

కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ, పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ఇటు హీరోయిన్ గా అటు సింగర్ గా రాణిస్తూ అనతి కాలంలోనే అభిమానుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది శృతిహాసన్. తరచూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది ఈ భామ.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన కెరీర్ తొలినాటి సంగతులను గుర్తు చేసుకుంది. తన హైట్ గురించి చాలామంది కామెంట్స్ చేశారని.. ఎక్కువగా హైట్ ఉండడం వల్ల హీరోయిన్ గా రాణించడం కష్టమని నిరుత్సాహపరిచారని చెప్పింది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ హైటే తనకి అడ్వాంటేజ్ గా మారిందని చెప్పింది. ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల సరసన అవకాశాలు రావడానికి నా హైట్ ఉపయోగపడుతుందని చెప్పింది.

- Advertisement -

ఇక ప్రస్తుతం ఈ భామ ఈ సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “సలార్” చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు