Jailer : షూటింగ్ కి ముహూర్తం

సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు ఎంత వచ్చినా, స్పీడ్ మాత్రం తగ్గించడం లేదు. 71 ఏళ్లు ఉన్నా, ప్రతి ఏడాది ఒక్కో సినిమాను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. అంతే కాకుండా వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఆదే ఏడాది సినిమాను విడుదల చేస్తున్నాడు.దర్భార్ తో 2020, అన్నత్తే తో 2021 లో రజినీ కాంత్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో కాస్త గ్యాప్ తీసుకున్నాడని అనుకున్నారు. కానీ, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా వస్తుందని ప్రకటించాడు సూపర్ స్టార్.

శివకార్తికేయన్ తో డాక్టర్, విజయ్ దళపతితో బీస్ట్ సినిమాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు రజినీకాంత్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో జైలులో వేలాడుతున్న కత్తి కనిపిస్తుంది. ఒక పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. కాగ ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే రజినీ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు సూపర్ స్టార్. ఈ నెల 15 నుంచి గానీ, 22 నుంచి గానీ షూటింగ్ ప్రారంభమవుతుందని స్వయంగా రజినీ కాంత్ వెల్లడించాడు. కాగా జైలర్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి రజినీ కాంత్ తో నటిస్తుందని సమాచారం. అలాగే కోలీవుడ్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు