Sekhar Master: స్టార్ హీరోయిన్ తో శేఖర్ మాస్టర్ ఎఫైర్.. నిజమేనా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డాన్స్ తో ఢీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకోవడం జరిగింది.. అలా ఎంతో మంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శేఖర్ మాస్టర్ గురించి తాజాగా ఒక విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది.. మరి వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన యాంకర్ శివ ఎన్నో ఇంటర్వ్యూలను ప్రత్యేకంగా చేస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సెలబ్రిటీల గురించి కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉండే శివ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా వివాదాస్పదమైన వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఓటీటి సీజన్-1 లో పాల్గొన్నా .. హౌస్ లో ఎక్కువ కాలం కొనసాగ లేక పోయారు. యాంకర్ గా ప్రస్తుతం బాగానే కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.

ఇటీవల ఢీ షో స్పెషల్ లాంచింగ్ ఎపిసోడ్లో కనిపించారు.. అయితే ఈ ఎపిసోడ్లో యాంకర్ శివ డాన్స్ చేస్తున్నాడో , యాంకర్ గా చేస్తున్నారో తెలియదు కానీ శేఖర్ మాస్టర్ ని మాత్రం ఒక విషయంతో హర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. యాంకర్ శివ ఎంట్రీ ఇవ్వడంతోనే శేఖర్ మాస్టర్ ని ఇలా అడుగుతూ.. మీకు ఒక హీరోయిన్ కి ఎఫైర్ అని ప్రచారం ఉంది కదా అని అడుగుతూ ఉండగా.. దానికి శేఖర్ మాస్టర్ సీరియస్ అయి వెంటనే “అసలు ఎవరు ఇతడిని రాణించారు.. నువ్వు వెళ్ళిపోతావా నన్ను వెళ్ళిపొమ్మంటావా” అంటూ సీరియస్గా గట్టిగా అరవడం జరిగింది.

- Advertisement -

అయితే ఇదంతా ప్రోమో కోసమో లేకపోతే నిజంగా జరిగిందో లేదో చూడాలి. అంటే ఢీ షో ఆడియన్స్ ముందుకు త్వరలోనే ఈ ప్రోగ్రాం రాబోతోంది. ఈ షో అంతా కూడా చాలా కొత్త కొత్తగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో పాత వాళ్లంతా కూడా ఢీ కి గుడ్ బాయ్ చెప్పడం జరిగింది. అయితే ఈసారి సీజన్-17 కి యాంకర్ గా నందు ఎంట్రీ ఇవ్వడం చూడవచ్చు. అలాగే జడ్జి గా శేఖర్ మాస్టర్ మాత్రమే కాకుండా పూర్ణ ప్లేసులో హీరోయిన్ ప్రణీత సుభాషిని తీసుకురావడం జరిగింది. అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, the latest Kollywood news, Movie Reviews and ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News and gossip in Tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు