Game changer:గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ పై దిల్ రాజు క్లారిటీ..!!

RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. అలాగే ఇందులో శ్రీకాంత్, జయరామ్ వంటి వారు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా విడుదల తేదీ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ డబుల్ రోల్ లో నటిస్తున్నారు. తండ్రి కొడుకులు గా రాంచరణ్ మొదటిసారి కనిపించబోతున్నారు.. ఇందులో ఒకరు సర్పంచ్ కాగా మరొకరు ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పలు రకాల పోస్టర్స్ , టైటిల్, గ్లింప్స్, పాటలు సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అయితే ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు.

మరోపక్క డైరెక్టర్ శంకర్ కమలహాసన్ తో కలిసి ఇండియన్-2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందంటూ అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా.. తాజాగా రిలీజ్ డేట్ పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు… నిన్న వీకెండ్ కావడంతో సలార్ సినిమా చూడడానికి బయటకి వచ్చిన దిల్ రాజు ను .. రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మూవీ గేమ్ ఛేంజర్ సినిమా గురించి అప్డేట్ అడగగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు.

- Advertisement -

అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఈ చిత్రంతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు