Dunki movie: ట్రైలర్ తోనే హిట్ కొట్టేలా కనిపిస్తున్న షారుక్..హ్యాట్రిక్ కొడతాడా..?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఈ ఏడాది వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్టర్ రాజకుమార్ హిరాని దర్శకత్వంలో డంకీ అనే సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 21న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధంగా ఉందని చిత్ర బృందం ప్రకటించడం జరిగింది.

నవంబర్ రెండవ తేదీన షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని సైతం విడుదల చేయగా అభిమానులను ఫుల్ ఖుషి అయ్యేలా చేసింది. ఆ తర్వాత రెండు పాటలను కూడా విడుదల చేయగా పర్వాలేదు అనిపించుకుంది. ఇటీవలే డంకీ సినిమా ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులకు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కొన్ని నిమిషాల ముందు ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక ఊర్లో ఉండే ఐదుగురు స్నేహితులు ఎలాగైనా సరే లండన్ కి వెళ్లాలనుకుంటారు. అలా అధికారికంగా వెళ్లాలంటే కచ్చితంగా ఇంగ్లీష్ రావాలని వారికి అర్థమవుతుంది. అయితే ట్రై చేసినప్పటికీ కూడా వీసా రిజెక్ట్ అవుతూ ఉండడంతో దీంతో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు.. వాళ్లకి హిందీ రావాలని మనం రూల్ పెట్టామా మరి మనకు ఇంగ్లీష్ ఎందుకు అని ఆలోచించి ఎలాగైనా సరే లండన్ కి వెళ్లాలనుకొని ప్రయాణం మొదలు పెడతారు.

- Advertisement -

అలా ఎన్నో దేశాలను అక్రమంగా దాటుతూ లండన్ కి ఎలా వెళ్లారు అనే కథాంశంతో ఈ సినిమా కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు పలు దేశాల నుంచి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే కథాంశం తో ఉండబోతున్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా నటించినట్లు ఈ ట్రైలర్ లో కనబడుతోంది. ఈ సినిమా మొదటి గంట సేపు కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఎమోషనల్ తో సాగబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం డంకీ ట్రైలర్ యూట్యూబ్లో ఒక ట్రెండీగా మారుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకి ఒక్కరోజు ముందుగానే ఈ సినిమా విడుదల అవ్వడం గమనార్హం మరి ఈ సినిమాతో షారుక్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి మరి.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు