HBD Payal Rajput : పాయల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ప్రముఖ యంగ్ హీరోయిన్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో గ్లామర్ తో యువతలో ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ గా నిలిచింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. అందులో అందాల ఆరబోతతో స్క్రీన్ ను షేక్ చేసిందని చెప్పవచ్చు. ఇక తర్వాత వెంకీ మామ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో కూడా నటించింది. అంతేకాదు అనగనగా ఓ అతిధి సినిమాలో కూడా కీలక పాత్ర పోషించిన పాయల్ రాజ్ పుత్ ఈరోజు తన 31వ పుట్టినరోజును జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పాయల్ రాజ్ పుత్ తల్లిదండ్రుల విషయానికి వస్తే.. విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్.. 2010లో టెలివిజన్ సీరియల్ తో నటిగా కెరియర్ ప్రారంభించిన ఈమె 2016 వరకు హిందీ చానల్స్ లో ప్రసారమైన సీరియల్స్ లో లీడ్ క్యారెక్టర్ లో అలరించింది. ఇక హిందీలో మొదటిసారి వీరే కి వెడ్డింగ్ అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసిన ఈమె తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా అడుగు పెట్టింది. ఇక ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టాండర్డ్ అందుకున్న ఈమె.. ఈ సినిమాతో ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది.

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయసుధ పాత్రలో కూడా నటించింది. ఇక తేజా దర్శకత్వంలో కాజల్, బెల్లంకొండ హీరో హీరోయిన్గా నటించిన సీత సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. మంగళవారం సినిమా రాకమందు వరకు సరైన అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అలా సోషల్ మీడియాలో రకరకాల గ్లామర్ ఫోటోషూట్ లు షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. వరుస హాట్ ఫోటోలను షేర్ చేసి మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మరొకసారి మంగళవారం అనే సినిమా చేసి తన నటనతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది. ఏది ఏమైనా ఈరోజు పాయల్ బర్త్డే సందర్భంగా అటు సినీ సెలబ్రిటీలు..ఇటు అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు