NTR : ఎన్టీఆర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. కోపం వస్తే ఏం చేస్తారంటే..?

జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో సేవా గుణంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది.

ఇందులో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అంతేకాదు విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గురించి అందరికీ తెలుసు. అయితే ఆయనలో ఉన్న మరో యాంగిల్ ఇప్పుడు చాలామందికి తెలియదనే చెప్పాలి. నిజానికి ఎన్టీఆర్ కి కోపం వస్తే ఆయనలోని మరో యాంగిల్ బయటకు వస్తుందట. అయితే ఈ విషయాలను స్వయంగా ఎన్టీఆర్ సోదరుడు ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ బయటపెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో రకరకాల ఆహార పదార్థాలను తానే తయారు చేసి అందరికీ వండి పెడతారట. ఏదైనా స్పెషల్ డిష్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా తనను కూడా పిలుస్తాడు అంటూ కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

అంతేకాదు ఎప్పుడైనా కోపం వచ్చినా లేదా ఫ్రస్టేషన్లో ఉన్నా సరే ఎన్టీఆర్ కిచెన్ లోకి వెళ్లిపోయి వంట వండుతాడని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. ఇక ఒకవేళ షూటింగ్స్ లేకపోతే ఎన్టీఆర్ ఇలా సైడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు అంటూ గతంలో కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా.. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. సైడ్ బిజినెస్ లేవీ పెట్టుకోవాలన్న ఆలోచన లేదు.. కానీ వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం.. కొన్నిసార్లు లక్ష్మి ప్రణతి కూడా నేను చేసిన వంట తిని ఒక వంద క్యారేజీలు నాకు చేసి ఇవ్వు.. అమ్మి పెడతానంటూ సరదాగా మాట్లాడుతుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ లో ఒక అద్భుతమైన చెఫ్ దాగి ఉన్నాడని తెలిసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు