Samantha: సమంతకు కోట్ల విలువ చేస్తే బంగ్లా ఇచ్చిన నిర్మాత..పెద్ద కథే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఒకానొక సమయంలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న ఈమె ఒకవైపు బాలీవుడ్ మరొకవైపు హాలీవుడ్ చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటోంది. మొదటి సినిమా ఏ మాయ చేసావే ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత తెలుగు , తమిళ్ భాషా చిత్రాలలో కూడా నటించి పేరు దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది

సమంత కోసం ఏకంగా ఒక స్టార్ ప్రొడ్యూసర్ 6 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లాను ఆమెకి బహుమతిగా అందించారు అంటూ ఒక వార్త మరింత హల్చల్ చేస్తోంది. అయితే ఆ ప్రొడ్యూసర్ ఎవరు ?ఎందుకు సమంతకు అంత విలువైన బంగ్లా ఇచ్చారు? అనే విషయానికి వస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు దక్కించుకున్న నిర్మాతలలో ఒకరిగా చలామణి అవుతున్న బెల్లంకొండ సురేష్ తన నిర్మాణ సారథ్యం లో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు.సురేష్ తన కుమారుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడు.. వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు . అయితే ఇందులో సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే అప్పటికే స్టార్ హీరోల సినిమాలలో నటించి మరింత బిజీగా మారిన సమంత ఇలా ఒక కొత్త హీరో పక్కన నటించడం అంటే నిజంగా సాహసం అని చెప్పాలి.

మొదట్లో సమంత ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఆమెకు ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే అంత విలువైన బంగ్లా ను కానుకగా ఇచ్చారట నిర్మాత బెల్లంకొండ సురేష్ . ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత సాయి శ్రీనివాస్ కి మంచి గుర్తింపు కూడా లభించింది .ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాను ఆయన రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా సమంత వల్లే సాయి శ్రీనివాస్ సినిమా కెరియర్ మరింత సక్సెస్ అయిందని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు