Santosham Awards: ఇలాంటివి ఇండస్ట్రీ లో కామన్.. చిచ్చు లేపుతున్న – సురేష్ కొండేటి..!

గోవా లో జరిగిన సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ లో కన్నడ ఇండస్ట్రీ వాళ్ళని అవమానించారని నిన్నటి నుండి సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సంతోషం మ్యాగ్ జైన్ అధినేత ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఈ అవార్డ్స్ ని స్వయంగా గత రెండు దశాబ్దాలుగా గ్రాండ్ గా ఫంక్షన్ నిర్వహించి ఇస్తున్నాడని తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా గోవా లో సంతోషం అవార్డ్స్ ఇవ్వగా, అక్కడ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళకి అవమానం జరిగిందంటూ కన్నడ మీడియా మొత్తం సురేష్ కొండేటి వల్ల తెలుగు ఇండస్ట్రీ ని కలుపుతూ బ్లేమ్ చేసారు.

దీనికి అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. ఎందుకంటే సురేష్ కొండేటి చిరంజీవి అభిమాని కాబట్టి, తాను పెట్టిన సంతోషం మ్యాగ్ జైన్ కూడా చిరంజీవి చేతుల మీదుగా చేయించాడు కాబట్టి, అప్పట్నుంచి చిరుకు సన్నిహితంగా మెలుగుతూ, మెగా PRO అంటూ చెప్తూ తిరుగుతాడు. అందువల్ల అనవసరంగా చిరుని కూడా ఈ విషయంలో లాగుతున్నారని అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ అవార్డ్స్ ఫంక్షన్ గురించి చిరంజీవి కి గాని, తెలుగు ఇండస్ట్రీ కి గాని ఏ సంబంధం లేదని, ఇది ఒక ప్రైవేట్ ఫంక్షన్ అని చెప్పారు.

అయితే తాజాగా సురేష్ కొండేటి ఈ వివాదం పై క్లారిటీ ఇస్తూ ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ లో గత 20 ఏళ్లుగా తానొక్కడినే ఈ అవార్డ్స్ ఇస్తున్నానని, దీంతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇబ్బందులు వచ్చాయి గాని, ఏ ఇండస్ట్రీ ని తక్కువ చేయలేదని సారి అంటూ సర్ది చెప్పుకున్నాడు.

- Advertisement -

అయితే ఇంతటితో వదిలేయకుండా పుండు మీద కారం జల్లినట్టు, తనని ట్రోల్ చేసిన వాళ్ళని లాగుతూ, ఇన్ డైరెక్ట్ గా తన మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు, అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పాయింట్ తో మళ్ళీ వైరల్ అయ్యాడు సురేష్ కొండేటి.

అయితే సురేష్ కొండేటి గత ఏడాది కాలంగా కూడా పలు సినిమా ప్రెస్ మీట్లలో తన వ్యక్తిగత ప్రవర్తన వల్ల ట్రోలింగ్ కి గురవుతున్నాడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంలో చాలా ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి సురేష్ పై ప్రత్యేకంగా వేరే ఇండస్ట్రీ వాళ్ళు బురద జల్లే అవసరం లేదు. తాను ఎప్పుడు దొరుకుతాడా అని ఇక్కడి ఇండస్ట్రీ వాళ్ళే ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయాన్నీ గుర్తుంచుకుని సురేష్ కొండేటి ముందు తన ప్రవర్తన మార్చుకుంటే మంచిదని ట్రేడ్ విమర్శకులు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు