Happy Birthday NTR: తనని తానే ఆవిష్కరించిన శిల్పి..!

నందమూరి నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమై నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వారసత్వంతో ఎంటరైనప్పటికీ, తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తారక్ కి Filmify తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేస్తూ, ఆయన సినీ ప్రస్థానంపై ఒక లుక్కేద్దాం. కెరీర్ తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకొని టాప్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ ఆ తర్వాత కథల ఎంపికలో కాస్త తడబడి వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. అప్పట్లో హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా, రభస వంటి డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. అయితే, టెంపర్ సినిమా సమయం నుండి ఆలోచన తీరులో, కథల ఎంపికలో తన పంథాని మార్చుకున్న ఎన్టీఆర్ RRR వరకు వరుస హిట్స్ తో అజేయంగా తన జైత్ర యాత్ర కొనసాగిస్తున్నాడు.
నిజానికి టెంపర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ఒక మైలురాయిగా చెప్పచ్చు. అప్పటివరకు హిట్ డైరెక్టర్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఎన్టీఆర్, టెంపర్ సినిమాకు ముందు ఫ్లాప్ లో ఉన్న పూరికి ఛాన్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఆ తర్వాత అరవింద సమేతకి ముందు అజ్ఞాత వాసి లాంటి డిజాస్టర్ నమోదు చేసిన త్రివిక్రమ్ తో హిట్ అందుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి RRR సినిమా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టింది.
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరున్న ఎన్టీఆర్ అప్కమింగ్ ఆర్టిస్ట్స్ కి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్న ఎన్టీఆర్, తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా, హ్రితిక్ రోషన్ తో కలిసి వార్ 2సినిమాలో నటించనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ అయినా దేవర ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా హిట్ అయ్యి తన విజయ పరంపర కొనసాగాలని ఆశిస్తూ ఫిల్మిఫై తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు