ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం నిన్న అంటే మే 12 న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బాగుంది అన్నవాళ్ళు ఉన్నారు, బాలేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు.పాటలు, ట్రైలర్ వల్ల ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. చిత్ర బృందం మొదటి నుండీ ఈ చిత్రాన్ని ‘పోకిరి’ తో పోలుస్తూ పబ్లిసిటీ చేసుకోవడం వల్ల మిక్స్డ్ టాక్ కు కారణమైంది అని చెప్పొచ్చు. అయితే మొదటి రోజు ఈ చిత్రం మంచి వసూళ్ళనే సాధించింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. పలు చోట్ల నాన్- ఆర్.ఆర్.ఆర్ రికార్డులను కూడా కొల్లగొట్టింది.
అయితే రెండో రోజు బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. రిలీజ్ రోజున వచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వుద్దా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత వరకు నిలబడుతుంది అని చాలా మందిలో ప్రశ్నలు ఉన్నాయి. అయితే ట్రేడ్ సిర్కిల్స్ నుండీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘సర్కారు వారి పాట’ వీకెండ్ 60 శాతం కలెక్ట్ చేసినా.. మొదటి సోమవారం 25 శాతం కలెక్ట్ చేసినా ఛాన్సులు ఉంటాయి అని చెబుతున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.120 కోట్ల షేర్ ను రాబట్టాలి.అంటే వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుందట.