భోళా శంకర్ కు మెహర్ రమేష్ పారితోషికం ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే చిత్రం తెరకెక్కుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాలం చిత్రానికి ఇది రీమేక్. ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహర్ రమేష్ కు అసలు ఛాన్స్ రావడమే ఎక్కువ అనుకుంటే అదీ మెగాస్టార్ తో ఛాన్స్ కొట్టేశాడు. అయితే మెహర్ రీమేక్ సినిమాలను బాగా తీస్తాడు అనే పేరు ఉంది. బిల్లా ని అతను చాలా బాగా తీశాడు.అదే విధంగా ఈ రీమేక్ ను కూడా తెరకెక్కిస్తారు అని తెలుస్తుంది.

ఈ చిత్రం కోసం మెహర్ రమేష్ పారితోషికం ఎంతో తెలుసా? నెలకి రెండు లక్షల చొప్పున ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే వరకు ఇస్తానని నిర్మాతతో అతను అగ్రిమెంట్ చేయించుకున్నాడు.2020 జనవరి నుండీ అగ్రిమెంట్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుండీ చూసుకుంటే రూ.58 లక్షల వరకు అందుతాయి. ప్రాజెక్టు ఫినిష్ అయ్యే సరికి అది రూ.1 కోటి వరకు వెళ్ళొచ్చు. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లో వచ్చే లాభాల్లో ఇతనికి కొంత వాటా కూడా వెళ్తుందట. అంతేకాకుండా గుంటూరు జిల్లా రైట్స్ ఈయనే తీసుకోబోతున్నట్లు వినికిడి. మొత్తంగా రూ.2 కోట్ల వరకు ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు