వివాదంలో చిక్కుకున్న మహేష్ కు కంగనా సపోర్ట్

ఇటీవల సర్కారు వారి పాట ప్రమోషన్లలోనూ, మేజర్ ట్రైలర్ లాంచ్ లోనూ.. తనకి వచ్చిన బాలీవుడ్ ఆఫర్ల పై మహేష్ స్పందించాడు. తనకి టాలీవుడ్ లోనే కంఫర్ట్ అని… బాలీవుడ్ తనని భరించలేదని మహేష్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తు లో కూడా తెలుగు సినిమాలే బాలీవుడ్ జనాలకి రీచ్ అవ్వాలి అనేది తన అభిప్రాయం అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. బాలీవుడ్ మీడియా మహేష్ ను రెండు రోజులుగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంది. బాలీవుడ్ ను మహేష్ ఏదో అనేసినట్టు రెండు ఆకులు ఎక్కువేసి మరీ చెబుతుంది.

అయితే ఈ విషయం పై కంగనా రనౌత్ స్పందించింది. మహేష్ అన్నదాంట్లో తప్పేమీ లేదు.అది అతని వ్యక్తి గత అభిప్రాయం. అతనికి బాలీవుడ్ ఆఫర్లు చాలా వెళ్ళాయి.ఆ విషయం నాకు కూడా తెలుసు. బాలీవుడ్ వాళ్ళు కూడా హాలీవుడ్ తో నాకు కంఫర్ట్ ఉండదు, నేను వెళ్ళను అనొచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు… అంటూ కంగనా మహేష్ కు మద్దతు పలికింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు