Project-K: ప్రాజెక్ట్ కె పరిస్థితి ఏంటి.?

నాగ్ అశ్విన్ సినిమా, సినిమాకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది.
కానీ గొప్ప సినిమాను తీస్తాడు. “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్, మహానటి సినిమాతో తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్నాడు.
మహానటి సినిమాని మొదలుపెట్టినప్పుడు ఆమె కథను అంతలా ఏమి చెప్తారు అనుకున్నారు చాలామంది. కానీ సినిమా చూసిన తరువాత కళ్ళలో నీళ్లు తుడుచుకున్నారు.

అంతటి గొప్ప సినిమా తరువాత ఆ దర్శకుడినుండి ఎటువంటి సినిమా వస్తుందా అని అందరు ఎదురుచుస్తున్న తరుణంలో ఎవరు ఊహించని స్థాయిలో ప్రభాస్ తో ఒక లార్జ్ స్కేల్ సినిమాని అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ఈ “ప్రాజెక్ట్ కె” లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి “దిశాపటాని” కూడా ఎంట్రీ ఇచ్చింది.

మాములుగా సినిమాలను స్లోగా తీసే నాగ్ అశ్విన్ ఈ సినిమాను కూడా చాలా స్లోగా తీస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా హీరో ప్రభాస్ కి , దర్శకుడు అశ్విన్ కి మధ్య సింక్ కుదరట్లేదని,
వీటితో జరగాల్సిన పని సకాలంలో జరగకపోవడం వలన ఈ నిర్మాతలకు టెన్షన్ పెరిగి ఈ టీం పైన చాలా సీరియస్ గా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు జరగనంత భారీ బడ్జెట్ లో ఈ సినిమా నిర్మించబడుతుంది. దాదాపుగా 550 కోట్లు ఈ సినిమాకి వెచ్చించనున్నుట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు