Samantha : ఆ ఓటీటీ లోనే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటీవల పుష్ప చిత్రంలో ఓ  ఐటమ్ సాంగ్ లో కూడా  నటించి సోషల్ మీడియాని షేక్ చేసింది. ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, యశోద, ఖుషి వంటి చిత్రాలతో చాలా బిజీగా ఉంది.

ఇందులో లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం “యశోద”. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. యశోద చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక  కృష్ణ ప్రసాద్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.హరి, హరీష్ ద్వయం ఈ చిత్రానికి దర్శకులు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. 

ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫామెన్స్ మరో లెవెల్ లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలోకిి రానుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే నవంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు