Sai Dharam Tej : ప్రేమ నిజమేనా ?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలలో ‘తిక్క’ సినిమా తన కెరీర్ లో భారీ డిజాస్టర్ అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మాత్రం తరచు అందరి నోళ్లల్లో నానుతూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి. ఆ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందని దీంతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు గతంలో  వినిపించాయి. 

ఇక అందుకు తగ్గట్టుగానే సాయిధరమ్ తేజ పైనా కూడా సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది లారిస్సా బొనేసి. తాజాగా వీరిద్దరూ మరోసారి వార్తల్లో నిలిచారు. సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు  సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ అందుకు కారణమని చెప్పవచ్చు. 

ఇటీవల హ్యాపీ బర్త్ డే మై తేజ్ అంటూ లవ్ సింబల్ ని జత చేసింది లారిస్సా బొనేసి. దీనికి  “నన్ను  నిరంతరం డిస్టర్బ్ చేసే వ్యక్తి” అంటూ సాయిధరమ్ తేజ్ థాంక్స్ తెలియజేస్తూ లవ్ ఎమోజీలను షేర్ చేశారు.  దీంతో పాటు ఆమెతో సరదాగా దిగిన ఒక ఫోటోని కూడా షేర్ చేయడం విశేషం.  ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ట్వీట్లు చూసిన అభిమానుల సైతం వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని అడుగుతున్నారు. మరోవైపు వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ మెగా మేనల్లుడు తన ప్రేమ వ్యవహారం గురించి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడో వేచి చూడాలి మరి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు