Yashoda : టీజర్ అప్ డేట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారు ఉండరు. హీరో నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న అనంతరం సమంత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నది. ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్, కాతు వాకుల రెండు కాదల్, శాకుంతలం, యశోద సినిమాలో నటిస్తోంది.

దీనిలో యాక్షన్ త్రిల్లర్ గా యశోద సినిమా తెరకెక్కుతోంది. హరి-హరీష్ ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వినాయక చవితి సందర్భంగా యశోద సినిమా యూనిట్ ప్రేక్షకులకు క్రేజీ న్యూస్ వెల్లడించింది.

యశోద టీజర్ ను సెప్టెంబర్ 9న సాయంత్రం 5:49 గంటలకు లాంచ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేవారు. ఈ పోస్టర్ లో చుట్టూ మహిళలు ఉండగా, వారి మధ్యలో సమంత సీరియస్ లుక్ లో కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు