Siddhu Jonnalagadda : అప్పుడు రిజక్ట్.. మరి ఇప్పుడు ?

సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ఎప్పుడో ప్రారంభమైంది. చిన్న పాత్రల నుంచి హీరో వరకు ఎదిగాడు. కానీ, మొదట్లో మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అలాంటి సమయంలో గుంటూర్ టాకీస్ అనే సినిమాతో హిట్ కొట్టి, తనలో నటుడుతో పాటు రైటర్ కూడా ఉన్నాడని నిరూపించాడు. దీని తర్వాత సిద్ధు సినిమాలు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినా, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’, ‘మా వింత గాధ వినుమా’ లాంటి సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

మళ్లీ కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ‘డీజే టిల్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమా సిద్దు జొన్నలగడ్డ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నాడు సిద్ధు. అయితే ఈ గ్యాప్ లో సిద్ధుతో మరో సినిమా చేయాలని సితార ఎంటర్ టైన్ మెంట్స్ భావించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ మూవీ రీమేక్ హక్కుల్ని సితార సొంతం చేసుకుంది. దీనిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను సిద్ధుతో చేయించాలని అనుకుంది.

కానీ, ‘డీజే టిల్లు’ లాంటి కామెడీ ఎంటర్ టైనర్ వచ్చిన సమయంలో నెగిటివ్ షేడ్స్ వద్దు అని ఈ రీమేక్ ను సిద్ధు రిజక్ట్ చేశాడు. దీంతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ మరో హీరోతో ఈ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సిద్ధు చేతికి మరో రీమేక్ సినిమా వచ్చినట్టు తెలుస్తుంది. ప్రముఖ మలయాళ నటుడు టివినో థామస్ నటించిన ‘తళ్లుమాల’ మూవీ రీమేక్ హక్కుల్ని నైజాం కు చెందిన ఒక బడా డిస్ట్రిబ్యూటర్ 85 లక్షలకు దక్కించుకున్నారట. ఈ సినిమా గ్యాంగ్ గొడవలతో సాగుతుంది. ఈ సినిమాలో హీరోగా సిద్ధు ఫైనల్ అయినట్టు సమాచారం.

- Advertisement -

అయితే డీజే టిల్లును త్వరగా పూర్తి చేయాలని ఇప్పటి వరకు ఇతర ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సిద్ధు ఇప్పుడు ఈ రీమేక్ సినిమాకు టైం కేటాయించాడా అనే ప్రశ్న వస్తుంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు