Samantha: ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన సామ్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత బిజీ గా ఉంది. అదేంటి.. తెలుగులో ఖుషి తప్ప మరే సినిమా చేయలేదు. వేరే లాంగ్వేజ్ లోను పెద్దగా సినిమాలు ఒప్పుకోలేదు. అయినా ఎలా బిజీ అయ్యింది అంటారా? అయితే అది సినిమా షూటింగుల్లో కాదు. సినిమాలు చూసే విషయంలో. అవును శాకుంతలం సినిమా పరాజయం తర్వాత చాలా డల్ అయిపోయిన సమంత, దాని నుంచి రిలీఫ్ కావడానికి బయట పార్టీల్లో, ఈవెంట్స్ లో సమయం గడుపుతూ ఉంది. అలాగే మరో పని కూడా చేస్తుంది. సినిమాలు చూడటం.

అవును ఈ మధ్య సామ్ విపరీతంగా సినిమాల మీద సినిమాలు చూస్తుంది. మొన్న దసరా సినిమా చూసిన సమంత, ఇప్పుడు తన ఫ్రెండ్ ఇష్టమైన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తీసిన “అన్ని మంచి శకునములే” సినిమా చూసింది. సినిమా చూసాక ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాను. ఈ సినిమాలో నటించిన అందరు చాలా అద్భుతంగా నటించారు అంది. నటీనటులను, దర్శకులను ట్యాగ్ చేస్తూ బ్యూటిఫుల్ సినిమా  అని సమంత విష్ చేసింది.

ఇదే కాదు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన “బవాల్” సినిమా చూడటం కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది. ఇక ప్రస్తుతం విజయ్ సరసన “ఖుషి” సినిమాలో నటిస్తున్న సమంత ఆ తర్వాత ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న చెన్నై స్టోరీ, హిందీలో వరుణ్ ధావన్ తోను ఒక సినిమా చేయనుంది. ఇక శాకుంతలం తో డిజాస్టర్ ను అందుకున్న సమంత ఖుషి సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు