Tollywood: చరణ్, ఉపాసనకు టాలీవుడ్ టాప్ స్టార్స్ స్పెషల్ విషెస్!

మెగా ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభ తరుణం వచ్చేసింది. అందరి కలల్ని నిజం చేస్తూ కొణిదల ఉపాసన మంగళవారం ఉదయం 1:49 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. తమ హీరో తండ్రి అయ్యాడని రామ్ చరణ్ అభిమానులు సైతం ఎంతో సంతోషంతో అపోలో హాస్పిటల్ కి చేరుకొని మరి విషెస్ తెలియచేస్తున్నారు.

ఉదయం నుండే మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హాస్పిటల్ కి చేరుకున్నారు. అక్కడ మీడియా తో చిరంజీవి మాట్లాడుతూ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈరోజు మాకు పర్వదినం. ఎన్నో ఏళ్ళ మా కల నిజమయ్యింది అన్నారు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఉపాసనలకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ వస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ట్విట్టర్ పేజీల్లో శుభాకాంక్షలను అందచేశారు. వెళ్ళేగాక నాని, నిఖిల్, నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ తమ ట్విట్టర్ పేజీల్లో స్పెషల్ గా విష్ చేసారు. ఇక కాబోయే మెగా తోడి కోడలు లావణ్య త్రిపాఠి కూడా విషెస్ చేయడం విశేషం.

- Advertisement -

ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు పెద్ద మొత్తంలో మెగా అభిమానులు అపోలో హాస్పిటల్ కు రావడంతో అక్కడ సెక్యూరిటీని పెంచారు. ఇకఈ సంవత్సరం సినిమాల పరంగానే కాక ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి రావడం మెగా ఫ్యామిలీ కి ఎంతో సంతోషాన్నిస్తుందని చెప్పాలి. వారం కిందటే వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్ధం జరగడం, ఇంతలో మెగా వారసురాలు పుట్టడం పట్ల మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు