AHA: ఓటిటి లోకి వచ్చేస్తున్న ఆ రీసెంట్ సూపర్ హిట్ సినిమా !

ఇటీవలనే రిలీజై థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఒక చిన్న సినిమా త్వరలోనే ఓటిటి లోకి రావడానికి సిద్ధమైంది. చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా వచ్చిందని ప్రేక్షకులు ఆ సినిమా చూడటానికి బ్రహ్మరథం పడుతుంటే షుగర్ పేషంట్స్ అయిన ప్రముఖ రెండు ఓటిటి సంస్థలు మాత్రం ఈ సినిమాను ఓటిటి రిలీజ్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.

శ్రీ విష్ణు హీరోగా, రెబ్బా మోనికా జాన్ హీరోయిన్ గా, సీనియర్ యాక్టర్ నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సామజవరగమన సినిమా గురించి అందరికి తెలిసిందే. గతంలో కమెడియన్ సత్యను హీరోగా పరిచయం చేస్తూ వివాహభోజనంబు సినిమాను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని ప్రజెంట్ చేయగా, రాజేష్ దండ ఈ సినిమాని నిర్మించారు.

అయితే ఈ సినిమాపై నమ్మకంతో మేకర్స్ సినిమా రిలీజ్ కు ముందే కొన్ని థియేటర్స్ లో ప్రీమియర్ షో లువేశారు. డీసెంట్ కామెడీతో, మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమా అందరిని కడుపుబ్బా నవ్వించగా అదే పాజిటివ్ టాక్ తో జూన్ 29న సామజవరగమన థియేటర్స్ లో రిలీజయ్యింది. చాలా రోజుల తరువాత వచ్చిన కుటుంబకథా చిత్రం అవడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మ రథం పట్టారు.

- Advertisement -

రిలీజ్ కు ముందు కొనడానికి బయ్యర్స్ కూడా లేని ఈ సినిమా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఇప్పటి వరకు 47 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకా కూడా థియేటర్స్ మంచి యాక్యుపెన్సీ తో ప్రదర్శించబడుతుండగా, ఈ సినిమాను వచ్చే పది రోజుల్లో నెట్ ఫ్లిక్స్ మరియు ఆహా ఓటిటి లలో ఈ సినిమా స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. ఈ విషయాన్నీ ఇటీవలెనే ఆహా టీం పోస్ట్ ద్వారా ధృవీకరించింది. మంచి సినిమాలు రావడమే అరుధైపోతున్న ఈ రోజుల్లో వచ్చిన ఒకటి, రెండు సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడనివ్వకపోతే ఇంకా సినిమాలు థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లలో రిలీజ్ చేయడం ఉత్తమమైన పని అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు